కాలము త్వరగా గతించి పోవుచున్నది. రాజకీయపరంగా మన రాష్ట్రానికి చాలా నష్టము కలుగజేసిన సంవత్సరము. ఆరోగ్యరీత్యా కూడా తిరిగి కొన్ని వ్యాధులు ప్రబలిన సంవత్సరముగా ఉన్నది. కొందరు బాగుంటుందని, మరి కొందరు బాగుండదని చెప్పవచ్చు. కాని దేవుడు అన్ని రోజులను మంచిగానే చేశాడు. కాని పరిధిలో అది చెడుగా అనిపించవచ్చు.
ఈ సంవత్సరంలో మనము ఎలా ఉండాలో అనే విషయాన్ని వాక్యసహాయముతో ధ్యానించెదము .
- దేవుని కన్నులు……. ద్వితీ.11:12. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును. దేవుని కన్నులు ఆదేశము మీద ఎల్లప్పుడు ఉండునని మోషే గారు చెప్పుచున్నారు.
ఆయన కన్నులు ప్రతి మానవుని మీద ఎల్లప్పుడూ ఉంటున్నవి.
సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతిస్థలము మీద……… చెడ్డ వారిని మంచి వారిని అవి చూచు………
కీర్తనలు 11:4 ఆయన నరులను కన్నులారా…. పరిశీలించు………
కీర్తనలు 121:4 కునుకడు నిద్రపోడు…….
ఆయన చూపు లోతైనది పైరూపమే కాదు లోపల కూడా చూడగలడు.
ఆది 6:5 నరుల చెడుతనము……..వారి హృదయము………..చూచి.
కీర్తన 139:16 నేను పిండమునై యుండగా……
1సమూయేలు 16:7 యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనలను చూచే దేవుడైతే రెండు విషయాలు ఉన్నవి.
A. మనలను కాపాడతాడు.
B. తీర్పులోనికి తెస్తాడు.
ఆయన కన్నుల నుండి మనము తప్పించుకోలేము. - దేవుని కార్యములు….. హబక్కూకు 3:2.
సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము.
నూతనమైనదిగా చేసే దేవుడు లోకములో అనేక నూతన విషయాలు కనిపెట్టబడుచున్నవి.
నూతన పరచు=Revive, Restore. ఉజ్జీవింప జేయు.———– మరల ——–
కీర్తనలు 51:12. Restore unto me
నాకు “మరల´´ పుట్టించుము.
కీర్తనలు 85:6.Revive us again.
మరల మమ్మును బ్రతికింపవా.
దేవుడు మానవుని జీవితములో నూతన కార్యము చేయువాడు.
మార్పు నొందిన మాదిరి జీవితాలు.
అ. కా.2:40,41. ఇంచుమించు మూడు వేలమంది బాప్తీస్మము పొందిరి.
అ. కా.9:35; 11:21. ప్రభువు తట్టు తిరిగిరి.
దేవుని వైపు తిరుగుటే నూతన కార్యము.
ఉదా :-పౌలు, నపుంసకుడు, లూదియ, చెరసాల నాయకుడు.
2 కోరింధి 5:17 ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి.
మన జీవితాలలో, కుటుంబాలలో, సంఘాలలో దేవుని కార్యము కొరకు కనిపెట్టాలి. మన కార్యములు కాదు. దేవుడు చేస్తాడు మనము కాదు. మనము ప్రార్ధించాలి. హబక్కూకు ప్రార్ధించాడు. - దేవుని కట్టడములు…. హోషేయ14:9. యెహోవా మార్గములు చక్కనివి దేవుడు మంచి కట్టడాలు ఏర్పాటు చేసినాడు. అవి మానవునికి ఆశీర్వాదకరమైన మార్గములు వాటిలో మనము నడవాలి. వాటిలో నడవాలంటే ఒంటరిగా నడవలేము.
ఫిలిప్పి 3:9 క్రీస్తును సంపాదించుకొని
ఎఫె. 4:24 నవీన స్వభావము.
తిమోతి 6:11 నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.
క్రీస్తు గుణములతో ఆయన మార్గములో నడవాలి.
ఎఫె. 5:10వ ప్రభువు కేదిప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు…
14 ఫిలి. 3:14 గురియొద్దకే…..
ఆయన మార్గములు గమ్యానికి గురియొద్దకు నడిపిస్తాయి.
మన గురి ఏమి? గురి ఉందా? దేవుని కన్నులు ఈ సంవత్సరములో మన మీద ఉన్నవి. జాగ్రత్తగా ఉందాము. దేవుని కార్యముల కొరకు కనిపెడదాము. దేవుని మార్గములో నడుద్దాము. దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్.
New Year-Deuteronomy 11:12