సిలువ నేరస్తులను శిక్షించుటకు ఉపయోగించే ఒక సాధనము. సిలువ లేకుండా క్రీస్తు మార్గము లేదు. సిలువ, రక్తము, మరణము అనేవి విడదీయలేని పదములుగా కూడా ఉన్నవి. క్రీస్తు మాటలలో సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. క్రీస్తు మరణ పునరుద్దానముల తరువాతే సిలువను గూర్చిన భావము మారిపోయింది, లోకానికి అదొక శక్తిగా మారిపోయింది.
క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు యేసు దీనిని గూర్చి చెప్పినప్పుడు శిష్యులకు అర్థము కాలేదు కనుక పేతురు అది నీకు దూరమగును గాక అని గద్దించినాడు.
పౌలు సిలువ రక్షింపబడే వారికి శక్తి అని వ్రాసినాడు. శిష్యులు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని అన్నారు. ఈ రీతిగా నేడు శిలువ మార్పుకోరే జీవితానికి ఒక శక్తిగా, పాపికి ఆశ్రయముగా ఉన్నది.
అసలు సిలువ సందేశము ఏమో ఈ వాక్య భాగమును ఆధారము చేసికొని చూచిన మూడు ముఖ్య విషయాలు తెలియుచున్నవి.
- సిలువ – నూతన సహవాసము.
ఎఫె. 2:13-16…….. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను.
అన్యులకు, యూదులకు సిలువ ద్వారా సమీప స్తులుగా సంధి చేసి క్రీస్తు ద్వారా నూతన పురుషుని చేశాడు.
అన్యులు యోధులు అనే అడ్డుగోడ తొలగిపోయినది. పరదేశులు, సున్నతి లేనివారు, నిబంధన, నిరీక్షణ, నిజదేవుడు లేనివారు సిలువ ద్వారా ఏకము చేయబడినారు.
అ. కా.2:42. వీరు……….. సహవాస మందును వారు ఆనాడు సుమారు పదిహేను దేశములకు చెందినవారున్నారు. వారందరు ఒకే సహవాసముగా ఉన్నారు.
1యోహాను 1:7. మనము వెలుగులో నడచిన………. అన్యోన్య సహవాసము
సిలువ ప్రాంతాలు, అన్యులు మొదలగు అడ్డుగోడలను తొలగించి నూతన సహవాసమునకు నాంది పలికినది.
క్రీస్తు సుంకరులతో, పాపులతో భోజనము…..
ఫిలిప్పు – నపుంసకుడు; అన్యులు – యూదులు; స్త్రీలు – పురుషులు; పాపి – పరిశుద్ధులు అనే బేధాలు లేవు.
చట్టాల ద్వారా పడగొట్టని అడ్డుగోడలు సిలువ పడగొట్టినది. - సిలువ – (నూతన బంధము) సమాధానము…. ఎఫె.2:16. దేవునితో సమాధాన పరచవలెనని………. సమాధాన కారకుడై
కొల 1:20. సిలువ రక్తము చేత………తనతో సమాధాన పరచుకొనవలెనని
1 పేతురు1:19. అమూల్య రక్తము చేత
మానవుడు దేవునితో సమాధానము కోల్పోయి నాడు. కారణము పాపము. ఆ పాపమును తొలగించుటకే సిలువ మరణము పొందినాడు.
యెషయా 53:5. మన అతిక్రమ…………. సమాధానార్ధమైన శిక్ష
యెషయా 53:6. తనకిష్టమైన త్రోవకు తొలగెను.
తప్పిపోయిన కుమారుడు తన కిష్టమైన త్రోవలో వెళ్ళినాడు. సామెతలు 3:1 నా కుమారుడా….
యూదా 11వచ కయీను త్రోవ………..
మనతో సమాధానము కొరకు పరలోకము నుండి భూమి మీదకు వచ్చి సిలువ ద్వారా ఆ సమాధానము కలుగచేసినాడు. - సిలువ – (నూతన జీవితము) సంపూర్ణత.
ఎఫె.2:21,22. పరిశుద్ధ దేవాలయము……… దేవునికి నివాసస్థలము………. కట్టబడు చున్నాము.
ఇది కొనసాగే ప్రక్రియ అలా కట్టుబడాలి అంటే మనము
ఎఫె.5:2. పరిమళ వాసనగా ఉండాలి.
11కొరి.2:14,15. క్రీస్తు సువాసన…… జీవపు వాసన
తీతు.2:14. సత్ క్రియలయందాసక్తి గల……..
1పేతురు.2:24. నీతి విషయమై జీవించు……..
కొల.1:22. పరిశుద్ధులు……
ఎఫె.4:12-15. సంపూర్ణ పురుషుల…… క్రీస్తు వలె……… ఎదుగుదము
పౌలు ఫిలి 3:12 సంపూర్ణ……..
సిలువ సందేశము నూతన సహవాసము, దేవునితో సమాధానము, సంపూర్ణ జీవితము కొరకైనది.
మనము జీవించునట్లు ఆయన మరణించినాడు. కనుక మనము పాపమునకు మరణము కలుగజేసి మన కొరకు కాక క్రీస్తు కొరకు జీవించాలి.
దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్.