సమయము. ఉపవాసము ఏ సమయాలలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఉపవాస సందేశ మే మి అనే విషయములను ధ్యానింపనై యున్నాము. బైబిలు నందు ధర్మశాస్త్రము నను సరించి కొన్ని నియమింపబడిన దినములున్నవి. ఆ దినములలోనే ఉపవాసమున్నారు. ఇశ్రాయేలీయులు చెరకు పోక ముందు, పోయిన తరువాత కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉపవాసమున్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ పరిస్థితుల నుండి తప్పింపబ డుటకు ఉపవాసముండిరి. అంతేకాదు ఆయా కాలములలో ఆరాధనలో వచ్చిన మార్పును బట్టి ప్రత్యేక సమయములలో ఉపవాసములు చేసే పద్ధతి వచ్చింది. అపోస్తులుల కార్యములు 13: 2, 14:28 కాలక్రమములో ఇవి కేవలము భక్తి ప్రదర్శన ఆచారములు కాగా ప్రవక్తలు యేసు వీటిని ఖండించినారు.
స్థలము. ఎక్కడ ఉపవాసముండాలి అనుటకు ఏ విధమైన నియమములు లేనప్పటికి ఒకటి రెండు చోట్ల దేవుని సన్నిధిలో ఉండాలనే పద్ధతి ఉంది కాని, పాటించే అవకాశము వారికి లేనప్పుడు వేర్వేరు స్థలములలో ఉపవాస మున్నారు. లేవి 23:26-28, యోవేలు 2:15.
ఎజ్రా నది దగ్గర……. ఎజ్రా 8:21.
నెహెమ్యా మైదానములో…….నెహెమ్యా 8:1.
మోషే కొండ మీద……..నిర్గమ 24:18 ;ద్వితీ 9:18,25; 10:10.
ఏలియా ప్రయాణములో…… 1రాజు 19:8.
యేసు అరణ్యములో…….. మత్తయి 4:1.
ఉపవాసములో ఆహారనియమాలను గూర్చిన స్పష్టత లేదు. మోషే ఏలియా యేసు 40 రోజులు ఉపవాసమున్నారు. మోషే ధర్మ శాస్త్ర ప్రతినిధిగా, ఏలియా ప్రవక్తల ప్రతినిధిగా, ఏసు లో ఇవి రెండు నెరవేరినవి కనుక యేసు కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు ఏకాంతముగానే ఉపవాసమున్నారు ఉపవాసము, ప్రార్థన వేరు చేయలేము రెండు కలిసే ఉండాలి. ఈ ముగ్గురిని గమనించిన ఉపవాసములో ఉండే మూడు విషయాలు కనిపిస్తాయి అవి మనకు కూడా అవసరము.
- దేవుని శక్తిని పొందుట. మోషే 40 రోజులు దేవుని సన్నిధిలో ఉండి దేవుని శక్తిని పొందుకు న్నాడు. నిర్గమ 34:35 మోషే ముఖచర్మము ప్రకాశింపగా………….32:19 ఆ పలకలను పడవేసి దైవసహాయములో దేవుని శక్తిని పొందు కుంటాము. ఏలియా 1 రాజు 19 అధ్యాయము మరణాపేక్ష కలిగిన ప్రవక్త ఉపవాసము ద్వారా దేవుని పర్వతమునకు వచ్చినాడు. యేసు ఉపవాసము తరువాత లూకా 4:14 ఆత్మబలముతో, మార్పు 9:29 ప్రార్థనవలననే. ఉపవాసము దేవుని శక్తిని ఇస్తుంది. దేవుని సహవాసములో సమయము గడిపినప్పుడు దైవ శక్తిని పొందుకుంటాము.
- దేవుని స్వరమును వినుట. మోషే నిర్గమ 33:11, 32:16. పది ఆజ్ఞలు దేవుని హృదయము. ఏలియా దేవుని స్వరమును విని నాడు యేసు 04:18 ఉపవాసము దేవుని స్వరమును,దేవుని చిత్తమును ఎరిగే సమయము. మన స్వరాన్ని వినిపించడం కాదు దేవుని ఇష్టాన్ని తెలుసుకోండి. ఆది 3:8 యెహోవా స్వరమును విని. మత్తయి 17 5 ఈయన మాట వినుడని యొక శబ్దము. యోహాను 10:4 గొర్రెలు అతని స్వరమును ఎరుగును. అపోస్తుల కార్యములు 22:7 ఒక స్వరము పలుకుట వింటిని. ప్రకటన 3 20 ఎవడైనను నా స్వరము విని………..
ఉపవాసములో దేవుని స్వరము వింటున్నామా మన స్వరాలే వినిపిస్తున్నామా.
మోషే, ఏలియా, యేసు 40 రోజుల ఉపవాసము లో దేవుని స్వరాన్ని విన్నారు. - దేవుని చిత్తము జరిగించుట. మోషే ఇశ్రాయేలీయుల యెడల దైవ ప్రణాళిక ప్రకారము జరిగించినాడు. ఏలీయా దేవుడు అప్పగించిన పనిని జరిగించాడు. యేసు చివరివరకు నజరేతు ప్రణాళికను నెరవేర్చినాడు. మనము దేవుని చిత్తాన్ని చేయటమే నిజమైన ఉపవాసము.
యెషయా 58:6-8 యాకోబు 1:27. ఈ lent seasonలో దేవుని శక్తిని పొందుకుందాము. దేవుని స్వరమును విని దేవుని ఇష్టాన్ని నెరవేరు ద్దాము. దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్.