యేసు శరీరధారిగా ఉన్న దినములలో చివరి వారములో జరిగిన సంఘటనలకు ఇది ప్రారంభము. ఇది యెరూషలేములో జరిగిన సంఘటన. నలుగురు సువార్తీకులు దీనిని వ్రాసినారు. ఇది ఆదివారము నాడు జరిగినది. వారములో మొదటి రోజు. ఆదివారము రారాజుగా ప్రకటించుకుని, ఆదివారమున పునరుత్ధానుడయ్యెను.ఆదివారమున ఆత్మ కుమ్మరింపు కలిగెను. నాటినుండి ఆదివారము ప్రాముఖ్యదినమాయెను. పాతనిబంధనలోని ఏడవ దినము, విశ్రాంతిదినమునకు ఉన్న నియమములు ఆదివారమునకు ఆపాదించడం జరిగినది. కనుకనే క్రైస్తవులు ఆదివారము వాటిని పాటిస్తారు.
ఆ రోజు దేవునికి మొదటి స్థానము ఇవ్వడం మంచిది.
జయ ప్రవేశము నాడు జరిగిన ప్రజల మాటలు పాత నిబంధనను ఆధారము చేసికొనినవే.
యేసు ప్రభువును ఈ సంఘటనలో చూచిన మూడు రీతులుగా ఆయన వైఖరిని ధ్యానింపవచ్చు.
- యేసు మాటలు. యేసు శిష్యులతో పలికిన మాటలు ఆ సంఘటనలో యేసు మాటలు గమనించిన,
A. వెళ్ళండి. సమీప ప్రదేశమునకే వెళ్ళమంటు న్నాడు. అందుబాటులో ఉండే స్థలము. దూర ప్రాంతము కాదు.
B. విడిపించండి. కట్టబడిన గాడిద ఉన్నది దానిని విడిపించాలి. అన్ని రకాల బంధకాల నుండి ఒత్తిడుల నుండి విడిపించాలి. లూకా 4: 18 చెరలో ఉన్నవారికి విడుదలను…………. నలిగిన వారిని విడిపించు…….. అ.కా.8:23…… దుర్నీతి బంధకములలోను…… దేవునికి కావలసినది విడిపింపబడిన వారు.
C. నడిపించండి. “నా యొద్దకు´´ క్రీస్తు యొద్దకు తేవాలి. మత్తయి11:28. ప్రయాసపడి ……….. నా యొద్దకు రండి.
D. స్తుతించండి. 19:39, 40. ఆనాటి ప్రభువు మాటలు మనకు ఆజ్ఞలుగా ఉన్నవి ఆజ్ఞను మనము పాటించాలి. మత్తయి. 21:6. శిష్యులు యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము చేసి, మత్తయి. 26:19 పస్కా శిష్యులు ఆయనను ప్రేమించారు కనుక ఆయన ఆజ్ఞలు పాటించారు. మరి మనము? యోహాను 14 21 నా ఆజ్ఞలను అంగీకరించి నన్ను ప్రేమించు వాడు. ప్రభువు ఆజ్ఞలు పాటిద్దాము.
- యేసు మార్గము.
A. సాహస మార్గము. శాస్త్రులు పరిసయ్యులు యేసుని పట్టుకొనుటకు కాచుకొనియున్నారు. ఇక్కడ ప్రభువు బహిరంగముగా నేనే మెస్సియా అనే విధముగా వెళ్లడం ఆయన సాహసాన్ని తెలుపుతుంది. నేను క్రైస్తవుడను దేవుని బిడ్డను అని చెప్పుకునే ధైర్యం మనకు కావాలి.
B. సాత్వికమైన మార్గము. యజమాని అనుమతితో గాడిదను తీసికొని రమ్మన్నాడు. గాడిద ఎంత బరువైన మోస్తుంది. 1 పేతురు 2: 24 మ్రాను మీద మోసికొనెను. యెషయా 53: 4, 11 భరించెను. మెస్సియాగా ప్రవేశిస్తున్నప్పటికీ దీనత్వము కలిగినవానిగా ఉన్నాడు. ఆయన సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, లోక రక్షకుడు అయినా ఆయన మార్గము సాత్వికము, దీనత్వము. నిర్గమ. 5:2 ఫరో గర్వము. సాత్వికుడు గనుక వాక్యమార్గము ఆయనది కనుకనే ప్రవచనములను నెరవేరుస్తున్నాడు.
యేసు మనసు లూకా. 19:41. ఈ విషయము లూకా సువార్తలోనే కనిపిస్తుంది. ఇది నిశ్శబ్ద కన్నీరు కాదు. బిగ్గరగా అణచుకోలేక ఏడ్చి నాడు కారణం యెరూషలేము ఆయనను గుర్తించలేదు అవకాశం కోల్పోయినది. మత్తయి 23:27 యెరూషలేమా……….నాటి యెరూ షలేము పరిస్థితి. హెబ్రీ 12:17 ఏశావు, సౌలు, బుద్ధిలేని కన్యకలు యేసు ఎంతో concern కలిగి ఉన్నాడు. ప్రభువు గుణాలు మనలో ఉన్నాయా? ప్రభువు concern మనలో ఉందా?
వాక్య ప్రణాళిక మనలో ఉంటే ప్రజల చేత ఘనపరచబడతాము లేకుంటే మన ముగింపు శాపమే. ఆయన దీనత్వముతోనే నేడు పిలు స్తున్నాడు. ఆయన కొదమసింహముగా రాకముందే జాగ్రత్త పడదాము. దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్.