యేసు శరీరధారిగా ఉన్న దినములలో చివరి వారములో జరిగిన సంఘటనలకు ఇది ప్రారంభము. ఇది యెరూషలేములో జరిగిన సంఘటన. నలుగురు సువార్తీకులు దీనిని వ్రాసినారు. ఇది ఆదివారము నాడు జరిగినది. వారములో మొదటి రోజు. ఆదివారము రారాజుగా ప్రకటించుకుని, ఆదివారమున పునరుత్ధానుడయ్యెను.ఆదివారమున ఆత్మ కుమ్మరింపు కలిగెను. నాటినుండి ఆదివారము ప్రాముఖ్యదినమాయెను. పాతనిబంధనలోని ఏడవ దినము, విశ్రాంతిదినమునకు ఉన్న నియమములు ఆదివారమునకు ఆపాదించడం జరిగినది. కనుకనే క్రైస్తవులు ఆదివారము వాటిని పాటిస్తారు.ఆ రోజు దేవునికి మొదటి స్థానము ఇవ్వడం […]