TRIBUTES

Victor
Mr. & Mrs. M. Victor Paul

“Daddy” I loved and respected him all my life. He made a lot of sacrifices for us to be a best father. But only after having my child, I realised what it takes to be a parent like my dad. Few things that I admire in him are:
1. Seek the Lord’s advice in all that he does
2. he is an early bird – sharp 4 in the morning, i see him on his knees.
3. Never start his day without prayer
4. Punctuality – Not only me, none of my church members can state an instance where he was late.
5. Loving – unconditional
6. Endure – a quality that is very difficult to keep up with.

On the whole, he is the best dad anyone could ever wish for. I feel blessed to stay with him till the very last moment. Losing him is beyond painful, but hoping I would see him again with the lord, I continue my life to be worthy to meet him again.

Sudhakar
Mr. & Mrs. K. Sudhakar

నీతిమంతులను జ్ఞాపకము చేసికొనుట ఆశీర్వాదకరమగును. సామెతలు 10:7.

గౌరవనీయులైన రెవరెండ్. గద్దలు ఇమ్మానుయేలు రాజు గారి జీవితము గొప్ప ఆదర్శప్రాయము.వారు నాకు మేనమామ. చిన్నప్పటినుండి నాకు సుపరిచితమే.
నేను చిన్నప్పటి నుండి బాబు మామ అని పిలిచేవాడిని హైదరాబాదులోని clock tower దగ్గర ఉన్న సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో మా తాత గారు మరియు ఇమ్మానుయేలు రాజు గారి నాన్న గారైన శ్రీ గద్దల సాలమన్ గారు పాస్టర్ గా పనిచేసే రోజులలో అక్కడ ఉన్న parsanageలో ఉండేవారు. బాబు మామ అక్కల, అన్న పిల్లలు అందరమూ సెలవులకు అక్కడకు వెళ్లే వారము. 

అప్పుడు మామ పిల్లలమైన మమ్మల్ని ఆడిస్తూ ఎంతో ప్రేమగా చూసుకునే వారు. మమ్మల్నే కాదు తన సహోదరీల పట్ల ఎంతో ప్రేమ, గౌరవం చూపించేవారు. తాను పెద్దవాడైన తరువాత కూడా వారి సహోదరీలు ఏ పని చెప్పినా చిన్నపిల్లవాడివలె చేసేవారు.

మామలో నేను గమనించిన శ్రేష్టమైన లక్షణము“చురుకుదనము´´ ఆయన జీవితములో ఎన్నడు కూడా సోమరితనమునకు చోటు లేదు. ఆయన లేటుగా హాజరైన మీటింగ్ గాని,పెండ్లి గాని, సండే వర్షిప్ గాని తన జీవితంలో ఒక్కటి కూడా లేదు. ఏ ప్రార్థన అయినా అరగంట ముందే ఆయన వచ్చేవారు. ఆయన తన కుటుంబాన్ని ఎంతో ప్రేమించేవారు. అదే రీతిగా తన సంఘాన్ని కూడా అంతే ప్రేమించే వారు.

ఏ ఊరు వెళ్లిన తన సంఘాన్ని వదిలి ఒక్క రోజు కూడా ఉండలేకపోయేవారు అంతగా ఒక మంచి కాపరివలె సంఘాన్ని కాచారు.

దేవుని యెడల భక్తిలో ఎంతో ఉన్నత స్థాయిలో ఆయన ఉండేవారు. ప్రతి రోజూ ఉదయాన్నే లేచి కుటుంబ ప్రార్థన చేసేవారు. ప్రతి శుక్రవారము క్రమం తప్పకుండా తన జీవితమంతా ఉపవాసముండేవారు.తన జీవితంలో తప్పక దశమభాగము దేవునికిచ్చేవారు. అంతేకాదు తన కుమార్తెల జీతాలలో కూడా దశమభాగము ఇచ్చేవారు. నూతన ఆలయ నిర్మాణం కొరకు ఎంతో ధనాన్ని ఇచ్చి దేవుని ఘనపరచారు.

ఆయన ఎంతో నీతిగా జీవించారు. ఆయన సంఘములో గాని,బంధువుల దగ్గర గాని అబద్ధ మాడడం ఎన్నడూ నేను వినలేదు. ఎవరూ చెప్పలేదు. అంత యధార్ధముగా నీతిగా జీవించే వారు. 

మరియు వివాహాలు చేసేటప్పుడు కూడా వధూవరులలో ఒకరు తప్పకుండా బాప్తిస్మము తీసికుంటేనే పెళ్లి చేసేవారు. అంతేకాదు పెళ్లి కోసమే బాప్తిస్మము ఎప్పుడు ఇవ్వలేదు.

ఆయన ఎంతో మందిని సేవలో ప్రోత్సహించేవారు. నేను సెమినరీ చదివేటప్పుడు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించి “తెలుగు వేదాంత సమితి´´ అనే ఐదు వ్యాఖ్యాన గ్రంథాలు 4-10-2010 తారీఖున నాకు బహుకరించారు.

ఆయన ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండేవారు వస్త్రధారణ కూడా ఎల్లప్పుడూ హుందాగా ఉండేది, అంతేకాదు తన చుట్టూ ఉన్న వారితో జోక్స్ వేస్తూ సంభాషించేవారు. ఆయనకు మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండేది.

తన బంధువులను కూడా ఎంతో ప్రేమించేవారు ఎల్లప్పుడూ వారితో ఫోన్లో పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకునే వారు, అంతేకాదు బంధువుల గృహాలలో జరిగే ఏ కార్యక్రమానికైనా, ఎంత దూరమైనా వెళ్ళి హాజరయ్యేవారు. ఇంటికి వచ్చిన బంధువులకు మంచి అతిధ్యం ఇచ్చేవారు.

ఆయన వాక్యబోధ ఎంతో ఆత్మీయంగా ఉండేది. వాక్యములో జోకులు, పిట్టకథలు చెప్పేవారు కాదు. వాక్యాన్ని పరిశుద్ధముగా, గంభీరముగా బోధించేవారు. అందుకే ఆయన వాక్యము అందరి మనసుల్లో నిలిచిపోయింది. బాబు మామ వాక్యము బోధిస్తున్నప్పుడు కంఠస్వరము కూడా గంభీరంగా ఉండేది. మనుషులను మెప్పించాలని ఆయన ఎప్పుడూ బోధించలేదు. కానీ దేవుని మెప్పించాలనే ఆయన చివరి వరకు బోధించేవారు.

ఏదిఏమైనప్పటికీ సంఘము ఒక మంచి కాపరిని, బంధువులు ఒక మంచి ఆత్మీయుని, కుటుంబము ఆ ఇంటి యజమానుని కోల్పోయింది. శరీరరీతిగా ఆయన మనకు దూరమైనా పరలోకమందు మన ప్రధాన కాపరి యైన ప్రభూవారితో ఆయన ఉన్నారు. మంచి పోరాటము పోరాడారు, విశ్వాసాన్ని కాపాడుకు న్నారు, తన పరుగు కడముట్టించారు.ప్రభూవారి యొద్ద జీవ కిరీటము పొందుటకు ఆయన సన్నిధిలో ఉన్నారు.
“మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడ ముట్టించితిని విశ్వాసమును కాపాడు కొంటిని ఇకమీదట నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది´´. 2 తిమోతి 4:7, 8.

Isaac
Mr. Isaac Solomon Paul

నా చెలిమి

చిట్టి చిట్టి చేతులవి చిగురాకు రేకులవి,
చెలిమి చిరు కాంతుల దరహాసపు రేణువులవి: చక్కని చిటికెలో చరణపు వేడుకలవి,
చిక్కని చీకటిలో చరణపు రేణువుల రవి కాంతులవి.

బుడి బుడి నడతల, తడబడు మాటల,
వడివడి ఆశల, విసిరిన గువ్వల:
చెడుగుడు గుడుల, చెరిగేడు గొడుల,
చలువే చెలిమిని చేరిన చాలునురా.

చిట్టి చిట్టి చేతులలో నేటి చిన్ని పాపలుగా,
నీటి ఊట జోలలలో ఉట్టి పట్టు ఊయలుగా:
ధరదీర్తులలో శృత వేల్పులలో శరణపు వేడుకనే, శరణపు ప్రాయంబుననేవొలుకు చనుపాళ్లనునే.

ఉగ్గున ఉయలనే మురిపాళ్లుగా,
జోకొట్టు వేళనే జోల పడగ:
లాలినే సన్నజాజి మల్లినే,
మొగ్గ విరాజిల్లు చేమంతినే.

జోలనే జోలినౌ జాలరి కౌగిలినిన్,
గాంధర్వ గోవుల గడసరి కోవెలవా:
గగనపు వేడుకనౌ పక్షిరాజు నే గద్దను,
మా ఏలుబడివో – మా ఇమ్మానుయేలువా!

పర్వతములు తొలగిపోయినను, మెత్తలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన నా నిబంధన తొలగిపోదు, నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా54:10.

God is great
That’s All !
Psalms 145:3

The Kinsman

In trickles and twirls of trusting furls,
Of rosies and posies in loving pansies,
Blossoms the way for sky to stay,
In the morning’s wake of twickens day.

Trudging and trust a triumph,
Of stumble and crumble an ear’s Aleph;
The warmth of will and word to grace,
Swings the Cross of Crowning Face.

Lullies and lollies of heaven’s Lillies,
Of strings and springs in song’s of Ponies;
Cradling rock of Heaven’s Stock,
Comes the crown of Heaven’s Clock.

Paths of Glory in moments Tide,
Seeking face of nesting while;
Deep in trowel – The Lord’s Mine!
Comes the yuletide of Saviour’s Side.

Longing strength of Heavens Word,
Bid my flight bound and Heavenward;
The Song to spring and Heaven to Dwell,
In hearts to reign Thou – O´ Emmanuel !

The mountains shall depart & hills be removed;
But My Kindness shall not depart from thee,
Neither shall The Covenant of My peace be removed,
Saith the LORD that hath mercy on thee.
Isaiah 54:10.

God is Great
That’s All !
Psalms 145:3.

Moonie
V. Esther & daughter V. Beulah Vennela

పైకి చూస్తూ అడుగులు నేర్పిన ఓ మా గద్ద.
Looking up…. You thought us each step, O our Eagle.

నేను మీతో ఉన్నానని ముందుకు నడిపిన ఓ మా ఇమ్మానుయేలా
Telling us that i am there for you and making us walk forward, O our Emmanuel

ప్రతి గుండెలో శాశ్వతంగా నిలిచిపోయిన ఓ మా రాజు
You live in each one’s heart forever, O our Raju-King

మా గద్దల ఇమ్మానుయేలు రాజు
(బాబు మామ)

Olive boon
Mr. & Mrs. V. K. Chandu Lal Boon

మా తండ్రి గారైన గద్దల సొలొమోను గారు రామాయపట్నం బాప్టిస్ట్ వేదాంత కళాశాలలో పాత నిబంధన ఉపాధ్యాయులుగా దేవుని పరిచర్యలో వున్నపుడు నేను, మా తమ్ముడు రెవ గద్దల ఇమ్మానుయేల్ రాజు (బాబు) మా చెల్లి క్రిస్టినా ఫ్లోరెన్స్ (పాప) బాప్టిస్ట్ వారికి తలమానికమైన రామాయపట్నంలో జన్మించాము.

మా చిన్న నాడు రామాయపట్నంలో వున్నపుడు మిషనరీస్ ఒక పాట నేర్పించారు, అదే

“గలతీ 5:22 ను గమనించిచూడండి.
అందు ఆత్మ ఫలంబులు తొమ్మిదివున్నవి ఆశతో చదువండి.
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము,
మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహమనునవియే”

మా తమ్ముడు రెవ గద్దల ఇమ్మానుయేల్ రాజు గారిలో ఈ ఆత్మ ఫలము లోని వన్నియు ఉన్నవని చెప్పుటలో అతియసయోక్తి లేదు దేవుని సేవ భారమైనదని ఎరిగికూడా దేవదూతలకు లేని గొప్ప భాగ్యమని ప్రేరేపింపబడి యౌవనప్రాయములో దేవునికి తన జీవితాన్ని అర్పించుకొని తుది శ్వాసవరకు ఎన్ని అవాంతరాలు వచ్చిన గొప్ప దేవుని పరిచర్యను కొనసాగించిన ధన్య జీవి రెవ గద్దల ఇమ్మానుయేల్ రాజు గారు.

అపోస్తులుడైన పౌలు గారు చెప్పిన విధమున “మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది” II తిమోతి 4 :7 & 8.

1 . ప్రేమ : క్రీస్తు ప్రేమను అనుభవించి ప్రకటించుట మాత్రమే కాదు, ఆ ప్రేమను మా కుటుంబాలలో, సంఘంలో పంచాడు.

2 . సంతోషం : Joy depends on Jesus. ఫిలిప్పి 4 :14 – ప్రతి పరిస్థితిలో కూడా సంతోషముగా వుండేవాడు. కుటుంబ సభ్యులతో, సంఘ సభ్యులతో కూడా ఎంతయో సంతోషముగా జీవించాడు. ఎందుకంటె ఆయన హృదయములో యేసయ్య వున్నాడు.

3 . సమాధానము : తనను ప్రేమించే వారితో మాత్రమే కాదు తూలనాడి హేళన చేసే వారితో కూడా సమాధానము కలిగి జీవించిన ధన్య జీవి.

4 . దీర్ఘశాంతము : శాంతము కలిగి యుండగలముకాని దీర్ఘశాంతముకలిగి యుండుట చాలా కష్టము, కానీ రెవ గద్దల ఇమ్మానుయేల్ రాజు గారు ఒకే సంఘములో 27 సంవత్సరాలు సుదీర్ఘమైన సేవాపరిచర్య చేయగలిగాడంటే దేవుడు వారికి ఇచ్చిన వరం దీర్ఘశాంతము.

5 . దయాళుత్వము : సామె 3 : 2 దయను సత్యమును ఎన్నడు నిన్ను విడచి పోనియ్యకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఆ రీతిలో దయనుకలిగి అనేకుల యెడల, పేదవారి యెడల, దయాళుత్వము కలిగి దేవుని దృష్టిలో మంచి వాడనిపించుకొన్నాడు .

6 . మంచితనము : మంచితనముకు మారు పేరు రెవ గద్దల ఇమ్మానుయేల్ రాజు గారు. వారి మంచితనముద్వారా అనేకులను దేవుని సన్నిధికి నడిపించారు.

7 . విశ్వాసము : దేవునియెడల అచంచల విశ్వాసము కలవారు రెవ గద్దల ఇమ్మానుయేల్ రాజు దేవునికి ఎంతో నమ్మకముగా జీవించి,నమ్మకముగా పనిచేసాడు.

8 . సాత్వికము : ఎవరు నిందించిన మాటలతో హింసించి గాయపరిచిన నోరు మెదపగలిగికూడా క్రీస్తువలె నోరు మెదపలేని సాత్వికము చూపేవాడు.

9 . ఆశనిగ్రహము : సామె 4 : 22 లో చెప్పినట్లు తన హృదయాన్ని భద్రముగా కాపాడుకొంటు, మనస్సాక్షికి లోబడి ప్రతివిధమైన శరీర ఆశను నిగ్రహించుకొని, జయించి, దేవునికి ఇష్టుడుగా జీవించాడు.

ఈ లోకములో దేవుడు కోరుకున్న విధంగా, ఆత్మ ఫలమును ఫలించి దేవునికి నమ్మకమైన సాక్షిగా జీవించాడు.

పువ్వు విరిసి రాలిన పరిమళంబు మిగులును. మా ప్రియమైన తమ్ముడు మా మధ్య లేక పోయిన తాను వెదజల్లిన పరిమళాలలు మా మధ్యనే ఉన్నవి.

వారు నడచిన ఆ మాదిరికరమైన మార్గములో మేము, మీరు నడచి దేవుని దీవెనలు పొందుదాము.

సహా గద్దల ఆలివ్ బూన్
కీ శే రెవ గద్దల ఇమ్మానుయేల్ రాజు గారి 4 వ అక్కగారు.

Prasad
Mr. & Mrs. M. Prasad

Good qualities about my brother Rev. Gaddala Emmanuel Raju
1. ప్రార్ధనాపరుడు
2. మితభాషి
3. ప్రేమ గలవాడు
4. వాక్యాన్ని చక్కగా వల్లించే వాడు
5. భక్తి గల దైవజనుడు.
6. బంధువుల కంటే అధికముగా దేవుని సంఘాన్ని ప్రేమించినాడు.

Bharathi
Mrs. G. Bharathi and Family

మహాఘనుడు,మహోన్నతుడు,పరిశుద్ధుడు అయిన దేవునికి అత్యంత ప్రియులు, మాకు రక్తసంబంధికులైన పాస్టర్. రెవరెండ్. గద్దల ఇమ్మానుయేలు రాజు గారి అకాల మరణ వార్త విన్నప్పుడు మా హృదయాలు మిక్కిలి వేదనతో నిండిపోయాయి.

దేవునికి అత్యంత నమ్మకమైన, ప్రియమైన బిడ్డగా గద్దల ఇమ్మానుయేలు రాజు గారు ఈ లోకంలో జీవించి, ఆయన ఆత్మ తిరిగి దానిని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళి విశ్రాంతి పొందుతున్నాడని విశ్వసిస్తూ… వారిని జ్ఞాపకము చేసుకొనుట మనకు ఎంతో ఆశీర్వాదకరము.

భారతదేశంలో, తెలుగు బాప్టిష్టు సంఘచరిత్రలో తనదైన ముద్రవేసి గొప్ప దైవజనులుగా పేరుగాంచిన తన తండ్రి గారైన పాస్టర్.రెవరెండ్.గద్దల సాల్మన్ గారి చేతుల్లో బాప్తిస్మం పొంది… తెలుగు బాప్టిస్ట్ చర్చి, బాపట్ల సంఘాన్ని తన ఆత్మీయ సంబంధమైన బోధలతో పోషించి, మంచి కాపరిగా 25 సంవత్సరాల పైగా తన సేవలను అందించి, నిస్వార్థ క్రైస్తవసేవలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.

గద్దల ఇమ్మానుయేలు రాజు గారి వంటి వ్యక్తి నేటి సమాజంలో నిజంగా చాలా అరుదుగా కనిపిస్తారు. వారు నిర్వచించలేని ఒక పరిపూర్ణమైన వ్యక్తి .
కానీ… ఆయన ఒక గొప్ప క్రైస్తవుడు, సుబోధకుడు, పెద్ద సంఘ కాపరి, మార్గదర్శి, మితభాషి, పరోపకారి, మంచి స్నేహితుడు, నమ్మకమైన సహచరుడు, మరియు అత్యుత్తమమైన వ్యక్తిత్వం కలిగిన వారు.

ఆయన క్రైస్తవ జీవితం… ప్రస్తుత మరియు రాబోయే తరాల కొత్త క్రైస్తవ జీవితాలకు మంచి మాదిరికరమైనదని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము.
గద్దల ఇమ్మానుయేలు రాజు గారు, వారి తాత గారైన కీ.శే. గద్దల దావీదు గారు (ఆయుర్వేద వైద్యులు), తండ్రి పాస్టర్ రెవరెండ్ గద్దల సాల్మన్ అయ్యగారి పేరు ప్రతిష్టలు పరిమళింపజేశారు. అటువంటి వ్యక్తి మా గద్దల వంశం లో జన్మించినదుకు, గద్దల జాతి మొత్తం ఎంతో గర్విస్తూ… తరతరాలకు ఆయనను కొనియాడుతుంది.

రక్త సంబంధికులముగా, మా మరిది గారైన గద్దల ఇమ్మానుయేలు రాజు గారి కుటుంబముతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధంఉంది. వారు మా కుటుంబాన్ని బహుగా అభిమానించారు, ప్రేమించారు, ఆదరించారు. కానీ మేము చివరి చూపు నోచుకోలేక పోయినప్పటికీ, ఆ ప్రభువు రొమ్మున ఆనుకొనియున్న ఇమ్మానుయేలు రాజు గారిని కలుసుకొని తప్పక చూస్తాం అన్నదే మా గొప్ప కైస్తవ నిరీక్షణ.

మా మరిది గారి కుటుంబముతో మా కుటుంబము యొక్క ప్రేమ ఎల్లప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.
వారి కుటుంబాన్ని దేవుడు తప్పక ఆదరించును గాక. ఆమేన్.

Sagar
Mr. & Mrs. Y. Prem Sagar

మహామహులు – మహనీయులు – మాన్యులు – సుమనస్కులు – నిర్విరామ క్రీస్తు యోధుడు. బాపట్ల సి.బి.జెడ్. చర్చి. సంఘ కాపరి గౌరవనీయులు శ్రీ గద్దల ఇమ్మానుయేలు రాజుగారి సంస్మరణ సందర్భములో సవినయముగా సమర్పించు

నీరాజన ప్రసూనాలు

మహోన్నతుని చాటున నివసింపగోరి
మహాప్రస్థానం ముగించితివి
సర్వశక్తుని నీడను విశ్రమింపగోరి
సర్వ ప్రయాసలు సమాప్తం చేసితివి.
పరమేశ్వరుని గళము నలరింప పరము చేరి పరిమళభరిత సుమమాలవై నిలిచితివి.

రాజువై – గద్దల వర వంశోత్సంగమున ఉద్భవించి
రాజిత బాపట్ల బాప్టిష్ఠు సంఘమున సేవా సౌరభాలు వెదజల్లి
రారాజు సేవలో ముప్పది యేండ్లు అహర్నిశలు పరిశ్రమించి నేడు
రాజసం విడిచిన రాజకుమారునిలా కనుమరుగై పోయావు.

అభిమాన వేదాంత విద్య అరచేత బట్టి అసమాన ప్రజ్ఞా పాఠవాలు ప్రకటించి
పరిగణించబడి సాటిలేని మేటి పాదిరిగ పరిగ్రహించితివి శాశ్వత కీర్తి ప్రతిష్టలు.

మితభాషి – స్మితభాషి – సుమధుర సంభాషి మహోన్నత మహామనీషి – మంచిమనిషి
సంఘ శ్రేయోభిలాషి – నిత్యసంతోషి అలుపెరుగని దేవదేవుని పరిచర్యాభిలాషి.

రుగ్మతలు లేని లోకంలో
చికిత్సలవసరంలేని పరలోకంలో
అమరుల సంగీత సునాదాలతో
అమరేశ్వరుని ముఖప్రసన్నతలో
నిరంతరం నీకు నిత్యమైన ఆనందమే.

తండ్రీ! కనులముందు నీవు లేకున్నా
మా దేవాలయంలో అనువణువున నీవున్నావు తబిత జీవన సరళిలో నీవున్నావు
సలోనిక, జెరోనిక, రక్తనాళికలలో నీవున్నావు బాపట్ల బాప్టిష్ఠు దేవాలయ సంఘస్టుల నాలుకలలో నీవున్నావు.

నీ నిర్విరామ సేవా స్రవంతి అమరమైనది.
నీ నిస్వార్థపూరిత సేవానిరతి అజరామరమైనది.
నీ నిరాడంబరత, సహనశీలత అనితరసాధ్యమైనది.

నాళ్ళు గడిచినా మరువలేని ప్రేమమూర్తికి
ఏళ్ళు గడిచినా మాసిపోని శ్వేత కీర్తికి
కనులకు మరుగైన తీపి జ్ఞాపికకు
కనులను మెరిపించిన జ్ఞాన జ్యోతికకు

నేనేమివ్వగలను ?
ఈ అక్షర సుమాలు తప్ప.

Herbert
Mr. & Mrs. J. Sadhu Herbert

కీ||శే|| రెవరెండ్ గద్దల ఇమ్మానుయేలు రాజు గారి సంస్మరణ స్తుతి ఆరాధనను పురస్కరించుకొని అశ్రునయనాలతో, నా ఆత్మీయ గురువుకు సవినయముగా సమర్పించు అక్షర సత్యవాక్కులు

యాజకధర్మ వంశోద్ధారక
పరమ గీతముల అద్భుత ప్రబోధకర్త
ఆత్మల రక్షణ ప్రదాత
గద్దల వంశ యాజకధర్మ పరిరక్షకులు
ఆధ్యాత్మిక నిలయ గురుకులపతివర్యులు
గద్దల సాల్మన్ గారి సాహిత్యవనంబున
కాంతమ్మగారి కరుణ కాంతులతో వికసించి ఇమ్మానుయేలు రాజాభిషక్తుడైన వైనం అత్యద్భుతం – అమోఘం

ఆత్మీయుల ఆశాజ్యోతి!
తబితమ్మ తనువుతో మమేకమై
సలోనికా సంరక్షణలో భాగమై
విక్టర్ విశాల హృదయాంకితుడవై
జెరోనిక జీవన స్రవంతిలో మార్గదర్శివై
ఇవాన్, snipey చిరు దీపాలను వెలిగించి చిన్నారుల చిరు హృదయాలలో చెరగని ముద్రవేసి
చిరస్థాయిగా కుటుంబమదిలో నిలిచిపోయిన మీరు
ఆరాధనీయులు

నిరంతర సేవాతత్పరా!
ముప్పది వసంతాల నిరంతర దైవసేవలో మహోన్నత మందకాపరివై
సంఘ క్షేత్రాన దైవవాక్కులు వెదజల్లి
ఆత్మీయ ఫలాలు పండించి
జీవాహారము నొసంగిన తీరు
అతి మనోహరం – అతి సుందరం

ఆత్మల పరిరక్షకా!
ప్రాసకు పెద్ద పీఠవేసి
ముచ్చటగా మూడు మాటలు వల్లించి సమన్వయముతో సత్యశోధన చేస్తూ
ఆత్మల పరిరక్షణ సంకల్పసిద్ధితో
మంచి పోరాటము పోరాడితివి
కడకు మీ పరుగు కడ ముట్టించితివి
నిజంగా మీరు ధన్యజీవులు

సత్ బోధకా!
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆరాధన పుత్రా!
నిరంతర ధర్మశాస్త్ర పఠన పారాయణా
సువార్త సత్ బోధనల సంబారాలతో
సత్ శీల, సహనశీలివై
బాప్టిస్టు సిద్ధాంతాల సిరిని పంచుతూ
సంఘ కార్యక్రమాల సంప్రోక్షణతో
శ్రోతల హృదయ లోగిలిన నిలిచి
మరపురాని తీపిగురుతులతో
సాగిన మీ పయనం
మరపురానిది మరువలేనిది

ఆధ్యాత్మిక గురువర్యా!
మీరు లేరన్న నిజం నిత్యం
మమ్ములను స్ర్పుశిస్తుంది
మీ మధుర స్ర్ముతుల జ్ఞాపకాల తరంగాల తాకిడితో
ఆధ్యాత్మిక చింతనా శక్తిపరులమై
మీరు వేసిన బాటలో పయనిస్తూ
సత్ మార్గంలో నడయాడుతూ
పరలోకములో మిమ్ములను చూస్తాము అన్న
మా నిరీక్షణ ఫలించాలని
ఆ దేవదేవుని ప్రార్థిస్తూ
కన్నీటి పర్యంతమై వీడ్కోలు పలుకుతూ

Elisha Rao
Mr. & Mrs. Elisha Rao

కీర్తిశేషులు. రెవ. జి. ఇమ్మానుయేల్ రాజు గారు. పాస్టర్. సి.బి.జ్.చర్చి, బాపట్ల.
27 సంవత్సరాలు నిర్విరామంగా సంఘ ఆరాధనలు, సంఘ కార్యక్రమాలు నిర్వహించి, సంగస్థుల, సంఘేతరుల మన్ననలు చూరగొన్న మంచి సంఘకాపరి.
మితభాషి మరియు మృదుభాషి మాత్రమే గాక సునీత హాస్యములతో సంవర్థబోధలలో ఆత్మీయంగా అందరిని రక్షణ అనుభవము లోకిని నడిపించిన సంఘకాపరి. అందరి మనసులలో మీ జ్ఞాపకాలు మేము మేమెన్నటికి మరువలేము.
సంఘ అభివృద్ధి పనులకు మీరు చేసిన ఆర్థిక సహాయము అందరికి ఆదర్శనీయము. సంఘ పేదల యడల, సభ్యుల పట్ల బాధ్యతలు నిర్వహించిన తీరు ప్రశంసనీయం.
మీ సమయపాలన, మీ వాక్యసందేశాలు అభినందనీయం. సంఘమునకు మీ కుటుంబ సభ్యులకు మీరు లేని లోటు తీరనిది. 
ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్దాత్మ సహవాసమును విడువబడిన కుటుంబమును సభ్యులందరికీ తోడైయుండును గాక. ఆమెన్.

Prabhakar
Mr. & Mrs. M. P. Prabhakar Rao

నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము.
గద్దల ఇమ్మానుయేలు రాజు గారు మన బాప్టిస్టు సంఘములో సంఘ కాపరిగా 27 సంవత్సరములు పనిచేసి సంఘమును ఎంతో ఆత్మీయముగా నడిపించిన గొప్ప దైవజనులు. సంఘమును దేవుని మార్గములో నడిపించి గొప్ప పరిచర్య చేశారు.
దైవభక్తి, ప్రేమ, నమ్మకముగల గొప్ప దైవజనులు. ఆయన సహనశీలి. ప్రతి విషయములోనూ ఓర్పు చూపించేవారు. క్షమించేగుణం, పెద్దల పట్ల గౌరవం గల దైవజనులు. వారి కుటుంబ సమస్యలు కూడా సంఘముతో పంచుకునేవారు .
వాక్యము బోధించేటప్పుడు కొన్ని భాగములుగా విభజించి అర్థవంతముగా బోధించేవారు. అన్ని విషయాలలో సమయాన్ని పాటించేవారు.
సంఘమునకు వారు చేసిన సేవ చాలా గొప్పది. వారు లేని లోటు కుటుంబమునకే కాదు గానీ, సంఘమంతటికీ ఎంతో లోటు. మర్చిపోలేని సంఘటన, ఊహించలేని పరిస్థితి వారి మరణము.
వారి గురించి ఎంత చెప్పినా,వారిలో ఉన్న గొప్పతనము కంటే తక్కువే. వారి కుటుంబమును దేవుడు ధైర్యపరచి తగిన రీతిగా ఆదరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.

Sudhir
Mr. & Mrs. Sudhir Paul

Lives of great men all remind us, we can make our lives sublime, and, departing, leave behind us footprints on the sands of time.

~ Henry Wadsworth Longfellow

My association with Rev. Emmanuel Raju goes back to the 1980s when he moved to Bapatla as Pastor for Centenary Baptist Church with his young family. Over the years, he served faithfully in doing our Lord’s work and a true Christian who lived by example. He was a humble man who was never drawn towards money, fame, ambition, or the politics of the Baptist Churches. I shall always remember as a good steward who was faithful in His work towards the Lord and devoted to his responsibilities towards family.

He was a man of punctuality. The various meetings organized when we had the SAO Hostel maintained by my mother-in-law. Late. Mrs. Jonnalagada Mercy Prabhavathy and later by my wife – Mrs. G. Suman Sudhir, I don’t remember any occasion where he was delayed. All the events would begin with his prayer and end with a benediction. 

There was never any rush or hurriedness; rather, he would enjoy every moment, share wise words and refrain from gossip. Even if anything bothered him much, he would smile and brush it away, saying that our faithful Lord will undertake his needs.

After I relocated from Hyd, our bond of respect deepened further into friendship. We both would go on long walks to the beach and share a light moment of kids and domestic issues.

I vividly remember my last meeting with him, which was a day before his final departure. I met him to strengthen him and encourage him to stay strong. His sudden death came as a shocker as I couldn’t even get time to say a proper goodbye. As he was laid to rest, I knew my many memories of good times are lost.

I continue to miss our dear pastor, my good friend, every day. May God comfort the family and all of us too, and the Church fraternity. I pray that our dear Lord will help his family to live by his values and that the Church continues his legacy.

God bless us all

Srikanth
Mr. & Mrs. Srikanth

Pastor Mamaiah, I still can’t believe I’m writing a tribute because of your passing. Words cannot describe this difficult moment. I consider myself blessed to have lived this life as your niece. Mamaiah was humble, kind, loving, caring, and good at heart and soul. I remember like yesterday how you never failed to visit us whenever we were around bapatla. Thank you for always being around us. Mamaiah loved me; I can say that for sure. His blessings were abundant on our family. His prayers for us worked miracles in the family. I’m blessed to have you in my life. May our lord comfort and sustain your family now and always. May god almighty keep you safe resting in peace, Amen .

Lincoln
Mr. & Mrs. Lincoln

రెవరెండ్. జి. ఇమ్మానుయేలు రాజు గారు మా కుటుంబానికి ఆధ్యాత్మిక గురువు మరియు ఆత్మీయులు. మా సంఘానికి దీర్ఘకాలము దాదాపు 27 సంవత్సరాలు సంఘ కాపరిగా పనిచేశారు. నా వివాహమును,మా అన్నల వివాహములును వారి చేతులమీదుగా జరిగినవి. మా బిడ్డల వివాహాలు కూడా వారి చేతుల మీదుగా జరుపుకోవాలని అనుకున్నాము, కానీ దేవుడు మాకు అవకాశము ఇవ్వలేదు. వారు గొప్ప వ్యక్తిగత క్రమశిక్షణ గలవారు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మంచి ప్రసంగాలు ఇచ్చేవారు. పాస్టరు గారి ప్రసంగాలు ఎంతోమందిని ఆలయానికి ఆకర్షింపజేశాయి. ఎంతోమంది రక్షణ పొంది బాప్తిస్మము తీసుకున్నారు.
మా కుటుంబానికి పాస్టరు గారితో మంచి సన్నిహిత సంబంధము ఉన్నది. మా ఇంటికి ప్రతి నెల 3వ తేదీన హౌస్ విజిటింగ్ కి వచ్చేవారు. కనీసము ఒక గంట మా దగ్గర గడిపేవారు. 

అన్ని విషయాలు మాట్లాడుకునే వారము. మా సంతోషాలలో సంతోషించేవారు, మా బాధలలో బాధపడిన వ్యక్తి మా పాస్టరుగారు. మా కుటుంబము కోసం ప్రార్థించేవారు. పాస్టరు గారికి కోవిడ్ అని తెలిసిన తరువాత 12వ తేదీ నేను ఫోన్ చేశాను పాస్టర్ గారి ఫోన్ ఎంగేజ్ వచ్చింది. పాస్టరుగారు నాకు ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ ఎంగేజ్ లో ఉంది. చివరిగా నేను పలకరించ లేకపోయాననే బాధ నాకు ఇప్పటికీ ఉంది. మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు. వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు…. యోబు 5:26.పాస్టరుగారు దేవుని గృహానికి చేరారని విశ్వసిస్తున్నాను.

Jasmine
Mr. & Mrs. A. Wilson

దేవుని నామమునకు స్తోత్రములు అందరికి నా వందనములు.
రెవరెండ్. జి. ఇమ్మానుయేలు రాజు గారు. సి.బి.జెడ్. చర్చి సంఘ కాపరిగా 27 సంవత్సరాలు సుదీర్ఘ సేవా పరిచర్య చేసి దేవుని పిలుపుని బట్టి తన పరిచర్య ముగించి ప్రభువైన యేసుక్రీస్తునందు నిద్రించిన గద్దల. ఇమ్మానుయేలు రాజు గారి గురించి కొన్ని మాటలు పంచుకొనుటకు సంతోషించు చున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపుతో పాస్టర్ గారు ఇచ్చిన సందేశాలను బట్టి ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డాను. వాక్య భాగములోని భావాన్ని స్పష్టమైన భాషలో చక్కగా అర్ధమయ్యే రీతిలో బోధించేవారు. వాక్య సందేశానికి ముందు కీర్తన పుస్తకములో పాడే పాటలను అందరితో కలసి ఎంతో గంభీరంగా పాడేవారు.

నాకు ఆ పాటలు ఎంతగానో వచ్చేవి. లాక్ డౌన్ సమయములో వాక్య సందేశాలు అపోస్తలుడైన పౌలుగారు పత్రికల నుండి తీసుకొని అపోస్తలుడైన పౌలు గారు చూపించినప్రేమను గురించి పౌలుగారును పోలి నడుచుకోవాలని దుఃఖముతో చెప్పినది నాకు బాగా గుర్తు. ఓర్పు, సహనము, మితంగా మాట్లాడటం, తొందరపడి మాట తూలకుండుట ఇవన్నీ పాస్టర్ గారిలో నేను గమనించిన లక్షణాలు. భౌతికంగా మన మధ్య లేకున్నా వారిచ్చిన సందేశాలు జ్ఞాపకము చేసుకున్నా, తిరిగి చదువుకున్న మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. తిమోతి రెండవ పత్రిక 4:7 లోని మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడముట్టించిటిని విశ్వాసము కాపాడు కొంటిని అన్న వాక్యము మన పాస్టరు గారైన రెవరెండ్. జి. ఇమ్మానుయేలు రాజు గారి విషయములో నెరవేర్చబడింది. పాస్టర్ అమ్మ గారైన శ్రీమతి తబితా ఇమ్మానుయేలు రాజు గారిని వారి బిడ్డలను కృప గల దేవుడు ఆదరించి కాపాడాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటూనే ఉంటాను. ఈ అవకాశం కల్పించిన దేవునికి మరియు కుటుంబ సభ్యులకు నా వందనములు.

Sanjeev
Mr. & Mrs. Sanjeev

ఆత్మీయతతో…….
ఓ సోదరా! ఇమ్మానుయేలు రాజు నామధేయా! ప్రార్థన యోధులైన గద్దల సొలొమోను గారి ఇంట జనియించి ప్రియ మేనత్త తనయ తబితమ్మను పరిణయమాడి ఇరువురి పుత్రికలకు జన్మనిచ్చి వారి ఆలనాపాలనతో అలరారుతూ, తండ్రి అడుగుజాడలలో పయనిస్తూ, భావపురి కేతెంచి సీయోను దేవాలయ సంఘ కాపరిగా రెండు దశాబ్దాల పైగా అలుపెరగని మీ దైవసేవ అనిర్వచనీయం. సంఘ బిడ్డల్ని ఒక త్రాటిపై నడిపించి ఆత్మీయంగా మమ్ము బలపరిచిన రీతి ఎనలేనిది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలతో మీరు మమ్మును అలరించిన తీరు బహు ప్రశంసనీయం. ఆర్యా! మీ చిరు మందహాసం, నిరాడంబర మీ జీవితం ఎవరిని నొప్పించని మీ తీరుతో మమ్ములను ఆదరించారు. అనుకోని గడియలో మీ మరణవార్త అటు సంఘాన్ని, కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచి వేసిన, మమ్ములను వీడి వసంత కాలం గడచిన, సుధలు కురిపించిన మీ ఉపదేశాలు మా హృదిలో పదిలంగా ఉన్నాయి.
క్రైస్తవ నిరీక్షణ-ఒక దినాన మనమంతా ఆ ప్రభువు సన్నిధిలో కలుస్తామనే ఆకాంక్ష-తో నిరీక్షిస్తూ మీ సహోదరి.

Moses
Mr. & Mrs. Moses

ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.
పాస్టర్. రెవరెండ్. జి. ఇమ్మానుయేలు రాజు గారు 27 సంవత్సరాలు సంఘములో ఎంతో పరిచర్య చేసిన మృదుస్వభావి. వాక్యాన్ని స్పష్టంగా, సూటిగా అందించే గొప్ప దైవజనులు.
మేము 1996లో బాపట్ల వచ్చినప్పటినుండి మా కుటుంబము పాస్టర్ గారితో మంచి అనుబంధం కలిగి ఉండేది. మమ్ములను ఆత్మీయంగా ఎంతో బలపరచారు, మమ్మల్ని అన్ని విషయాల్లో ప్రోత్సహించేవారు, ఆదరించేవారు, ధైర్యపరచే వారు. మా పిల్లలిద్దరినీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఆత్మీయంగా బలపరచారు. August 5th, 2020లో Joel Pg నిమిత్తము అమలాపురం వెళ్లేముందు ఎంతో సంతోషంతో తనను దీవించి, ఆశీర్వదించి పంపించారు. పాస్టర్ గారు మా కుటుంబం పట్ల చూపిన ప్రేమను బట్టి దేవునిని మనసారా స్తుతి స్తున్నాను. వారు లేని లోటు సంఘములో, మరియు మా కుటుంబంలో ఎవరూ తీర్చలేనిది. వారి కుటుంబ ఆదరణ కొరకు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కుటుంబానికి వందనాలు తెలియజేసు కుంటున్నాము.

Church
Downie Hall Baptist Church, Nellore

భళా! మంచి దాసుడా

19వ శతాబ్దపు చివరి పాదంలో
భారతదేశంలో క్రైస్తవులు అధికంగా కలిగిన రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతున్న సమయంలో, పాశ్చాత్య మరియు భారత మిషనరీల త్యాగపూరిత ఆలోచనల ఫలితంగా ఉద్భవించినది, అప్పటి నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరి.
ఇది బాప్టిస్టు సంఘ చరిత్రలో ఒక అద్భుతం, ఆధ్యాత్మిక విప్లవం, ఎందరో మహనీయులైన సంఘకాపరులకు, పరిచారకులకు ఆధ్యాత్మిక జన్మస్థలము.

అట్టి మహోన్నతమైన స్థలములో దైవజనులు కీర్తిశేషులు రెవరెండ్.గద్దల. ఇమ్మానుయేలు రాజు గారు 1960వ సంవత్సరములో సెప్టెంబర్ 2వ తేదీనాడు జన్మించినారు. అప్పటికే అక్కడ వారి తండ్రిగారు కీర్తిశేషులు గద్దల.సాల్మన్ గారు వేదాంతవిద్య ఉపాధ్యాయునిగా బహుగా పేరు ప్రతిష్టలు కలిగియున్నారు.

అనంతరము క్రీస్తు ప్రభువుని పరిచర్యకొరకు సమర్పించుకొని ఆంధ్రాక్రిష్టియన్ థియోలాజికల్ కాలేజీ నందు బి. డి.పూర్తి చేసుకుని హైదరాబాదులో హాస్పిటల్ చాప్లిన్ గా, మియాపూర్ సంఘకాపరిగా ఫలభరితమైన పరిచర్య చేసిన పిదప,1993వ సంవత్సరములో బాపట్ల సెంటినరీ బాప్టిస్ట్ సంఘమునకు సంఘ కాపరిగా, అప్పటినుండి 2020 ఆగస్టు 13 వరకు వారు ఈ సంఘంలో చేసిన సేవ దేవునికి మహిమకరముగా ఎంతో ఘనమైనదిగా ఉన్నది.

కీర్తిశేషులు రెవరెండ్. గద్దల. ఇమ్మానుయేలు రాజు గారు 27 సంవత్సరములు సుదీర్ఘకాలం సంఘకాపరిగా ఆత్మల సంపాదనలో,సంఘ విస్తరణలో వినమ్రంగా, విశ్వాసంతో, మచ్చలేని వ్యక్తిగా, ప్రభువు పరిచర్య కొనసాగించిన తీరు మరువలేనిది.

భళా! మంచి దాసుడ అని దేవదేవుని ద్వారా అనిపించుకొని, ఆయన పిలుపునందుకొని ప్రభువు సన్నిధిని చేరుకొన్న రీతిని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుచూ…. మన ప్రియులను మనము తిరిగి కలుసుకొనెదము అని ప్రభువు మనకిచ్చిన క్రైస్తవ నిరీక్షణను బట్టి,

విడువబడిన కుటుంబమునకు, సంఘమునకు ఆదరణ కలగాలని సి.బి.జెడ్. సంఘము మునుపటి కంటే మరింత ఉత్తేజంగా, ఉత్సాహగానములతో ప్రభువు పరిచర్యలో ముందుకు సాగాలని ప్రార్థిస్తూ…..

ఆకాంక్షిస్తూ………
ప్రభువు పరిచర్యలో
గుఱ్ఱం. అరుణ్ కుమార్
B. A., B. Ed., B. L.,
సెక్రటరీ
బాప్టిస్ట్ సంఘము డౌనీ హాలు
నెల్లూరు సిటీ,
ఆంధ్ర ప్రదేశ్.

D. Moses
Mr. & Mrs. D. Moses

A person that departs from this earth never truly leaves, for they are still alive in our hearts and minds through us they live on.

Mr. G. Emmanuel Raju, Senior pastor, CBZ Church, Bapatla, is very dear to our family. We consider him as a family friend and he became spiritual father to our family. He used to teach us new things. He treats our family with great care and affection. He baptized our children. Every month he used to visit our house and inquire about well being of our family and prayers for our family. He preaches the gospel with utmost care by spending his time intimately with god. Many have blessed by his gospel. We are one among them. His personal life is with well-disciplined manner, filled with spirituality. And he lived an exemplary life. He made his family an ideal family. We are really sad about his sudden departure. It is a great honor to serve in a church for the past 27 consecutive years. We are deeply saddened by the loss of our pastor. He will be truly missed and we will include him in our daily prayers. We wish you farewell on your journey to eternity. May our lord bless and comfort his family.

Babu varaprasad
Mr. & Mrs. Babu Varaprasad

యేసు నామములో దేవునికి వందనాలు.
కీర్తిశేషులు ఇమ్మానుయేలు రాజు గారిని గురించి నాకు తెలిసిన కొన్ని విషయములను తెలియజేయుచున్నాను.
ఇమ్మానుయేలు రాజు గారు 1993లో trail message జరుగుచున్నప్పుడు మేము కూడా బాపట్ల వచ్చినాము. మేము బాపట్ల సంఘములో చర్చికి క్రమముగా వచ్చేవారము.అప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే సంఘములో సభ్యులు కనిపించేవారు. ఇమ్మానుయేలు గారు సంఘాన్ని ఎంతో అభివృద్ధి చేసినారు. వాక్యము ద్వారా ఎంతోమంది ఆత్మీయంగా ఎదిగినారు విసిటింగ్ కి వచ్చినప్పుడు బైబిల్లో తెలియని విషయాలను అడిగి తెలుసుకునేవారము.పాస్టర్ గారు మితభాషి, సమాధానముగా ఉండుట, తగ్గింపుతనము,ఎవరినీ నొప్పించే వారు కాదు. కాపరికి ఉండవలసిన లక్షణాలు కలిగినవారు. గొర్రెలు ఎటు చెదిరిపోకుండా ఒకే దారిలో నడిపించినారు ఏ విషయమునైనా వాక్యము ద్వారా గద్దించేవారు సమయాన్ని పాటించేవారు. మరణము వరకు తన పరిచర్యలో దేవునికి నమ్మకముగా ఉన్నారు. 

మా కుమార్తెలు సండే స్కూల్ కు వచ్చి ఆత్మీయంగా ఎదిగినారు సండే స్కూల్ లో టీచర్స్ ఎంతో చక్కగా దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించినారు. అలాగే నేను కూడా పాస్టర్ గారి వాక్యము ద్వారా, పాస్టర్ అమ్మగారు స్త్రీల సమాజములో అందించిన జ్ఞానము ద్వారా ఆత్మీయముగా ఎదిగినాను. పాస్టర్ గారితో సమానముగా పాస్టర్ అమ్మగారు సండే స్కూల్ విద్యార్థులకు,స్త్రీల సమాజములోని స్త్రీలకు ఆత్మీయంగా ఎదుటకు చక్కని పరిచర్య చేసినారు. ఇప్పటికీ పాస్టర్ గారు మరణించి సంవత్సరమయినా పాస్టర్ గారి ఫోటో చూడగానే పాస్టర్ గారు మన ఎదురుగా ఉన్నారు అని తలంచుచున్నాము. చివరిదాకా సంఘ కాపరిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించినారు.

Prabhudas
Mr & Mrs. M. Prabhudas

భావపురి పట్టణములో – బాప్టిస్టు చర్చిలో
భాధ్యతలు నిర్వహించి భగవంతుని
బాటలో పయనిస్తూ ఎంతోమందికి బాప్తిస్మములు ఇచ్చి ప్రభు మార్గములో నడిపించి. ప్రేమ, జాలి ప్రతి వారిపట్ల కనపరచి కన్నుమూసిన మన ప్రియతమ పాస్టర్ రెవరెండ్ గద్దల ఇమ్మానుయేలు గారికి ఇవే మా శ్రద్ధాంజలులు.

Israel
Mr. & Mrs. S. Israel

యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. కీర్తనలు…116:15.

కీర్తిశేషులు. రెవరెండ్. గద్దల. ఇమ్మానుయేలు రాజు పాస్టర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా సి. బి. జెడ్. చర్చి మరియు పరిసర ప్రాంతాలలో గొప్ప దైవజనులుగా గొప్ప ప్రసంగీకులుగా ఉన్నారు. సంఘ కాపరిగా అనేక మంది యవనస్తులను వృద్ధులను దేవుని ఆలయము లోనికి నడిపించిన గొప్ప సంఘ కాపరి. ఆయన జీవితంలో చివరి క్షణం నందు కూడా దేవుని ఆలయంలో పరిచర్యలో ఉండి ప్రభువు నందు నిద్రించి యున్నారు. పాస్టరు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన విడిచి వెళ్ళిన కుటుంబానికి దేవుడు ఆదరణ కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను.

Prathap
Mr. & Mrs. D. Prathap

IMMANUEL PASTOR GARU, Truly loved ….

The Bonding

Immanuel Pastor garu is known to us since the time of our marriage in 1998. He is the first pastor to visit our newly formed home. Since then till now, Pastor garu and his family is so dear to us and the BOND has grown stronger as years passed.

The Family Man

On every birthday/anniversary, the first call that we receive is from Pastor garu. He used to visit our home regularly every month and soon both Crispy and Jeru became a part of our family. On every occasion, in our and their family, we used to gather together. Their entire family loved both of us and our daughter Vincy very much. Their house used to be a second home for us especially for Vincy. Though, we are far away from our parents, the love and affection shown by Pastor garu, Pastoramma, Crispy and Jeru, made us feel at home. Many a time, Vincy used to be their with them when we both used to go for our jobs. Even our parents were convinced that we are in the caring zone of Pastor garu. Without Pastor garu and his family we would not have had a smooth stay of 12 years in Bapatla. Such was the trust and love that we received from that family.

The High Priest

Pastor garu is very punctual throughout his ministry, whether it is Church service, Church activities or house visits. He did the ministry with lot of passion and dedication. He encouraged each and every member of the Church to bring them to the Lord, made sure that he meets all those who come to the church on Sunday. His love towards the family, the Church and the Bapatla Christian Community was unconditional and unparallel. His preparation for the Sunday’s sermon was the topmost among the priority list. For so many college students of Bapatla, his messages were an inspiration, which brought many students to the Church. We could literally see how the Church has grown under his Stewardship.

The great loss

His sudden demise has shocked us beyond recovery. It’s a great loss not only to his family, relatives, the Church, Bapatla Christian Community but also to many families like ours in and out of the State. Indeed, Pastor garu is a great soul that influenced thousands of people through his love, his ministry and his sermons, bringing many to the Lord. A true servant of God, who is missed beyond words…                                          

Mr. & Mrs. R. Ravi Kumar

శ్రీ గద్దల ఇమ్మానుయేలు రాజు గారు

డచిన కాలమంతా మాకు ఆధ్యాత్మికమైన సువార్తనందించిన మా సంఘానికి పె
ద్ద అయినటువంటి కీర్తిశేషులు గద్దల ఇమ్మానుయేలు రాజు గారైన మీరు మా సంఘ కాపరిగా ఉంటూ ఆత్మీయంగా మమ్ము
ను ఎంతగానో ఆదరించిన దైవజనులు. మీరు దైవ సన్నిధికి పిలువబడి
ప్పటికి సంవత్సరకాలము ముగియనున్నదన్న తలంపే మాకు బాధాకరము. మీరు మ
మ్మా దరించిన విధానమును, క్రీస్తు ప్రేమను మాకు పంపించిన విధము
ను మేమెన్నటికిని మరువలేము, మరియు మరువజాలని సమున్నతమైన వ్యక్తి మీరు.
యే సుక్రీస్తునే ఆదర్శంగా తీసుకొని తన ఆఖరి శ్వాస వరకు సువార్తను ప
లువురికి ప్రకటిస్తూ క్రీస్తులో తన పరుగును తుదమట్టుకు కొనసాగించి
రారాజుగా వెలుగొందిన దైవసేవకులు మీరు. బాపట్ల సిబిజెడ్ చర్చి లో మకుటం లేని మహరా
జుగా వెలుగొంది క్రీస్తులో కీర్తి ప్రతిష్టలు పొందిన మీకివే మా నీరాజనాలు

Rahul
Mr. & Mrs. D. M. Rahul Dev

1993 – నవంబరు నందు మొదటిసారిగా వారిని నేను చూశాను సాధారణ వ్యక్తిగా చిననాటి దేవుని పరిచర్యకు వచ్చిన వానిగా పైకి కనిపించినా, గొప్ప దైవసేవకులు మరియు తండ్రి గారైన professor, Rev G. Solomonగారి ప్రసంగ అనుభవాన్ని పరిశుద్ధ గ్రంథము మీద పట్టును సంపాదించి – దేవుని వాక్యములో ఉన్న నిగూఢమైన సత్యాలు వెలికి తీయటమే కాక సరళీకృతమైన రీతిలో విశ్వాసులకు అందించడములో వారికి వారే సాటి.
క్రైస్తవ సంఘ పరిచర్య అనేది నిప్పుతో చెలగాటం ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా అన్నింటిని అధిగమించి సంఘముతో సమన్వయ పరచుకుంటు విజయభేరిని మ్రోగిస్తూ దిగ్విజయంగా ఈ పరిచర్యను 27 వసంతాలు కొనసాగించిన వారు రెవరెండ్ జి ఇమ్మానుయేలు రాజుగారు. వీరితో సహాయ సంఘ కాపరిగా 2005 సంవత్సరంలో ప్రారంభమైన నా సువార్త ప్రయాణం 15 వసంతాలు నిరాటంకముగా దిగ్విజయముగా కొనసాగింది. వీరి నుండి అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు ఈ ప్రయాణంలో తెలుసుకొనుట దైవ కృపే. వీరి పరిచర్య వెనుక ప్రభావితమైన ప్రార్ధనా శక్తి పాస్టరమ్మ శ్రీమతి తబితా ఇమ్మానుయేలు గారు మరియు వీరి ముద్దుబిడ్డలు క్రిస్పీ మరియు జెరూ. పరమ తండ్రియైన దేవుడు అనుకొనని విధముగా మానుండి వీరిని దూరపరచి తన దీన దాసుని నిత్యరాజ్యములోనికి తీసుకెళ్లిన, వీరి ప్రసంగాలు సంఘాభివృద్ధికై వీరు చేసిన కృషి ఆధ్యాత్మిక నాయకునిగా సంఘమును నడిపించిన తీరు ఎన్నటికీ ఎప్పటికి మరువలేనిది మరపురానిది.

Rev. D. MOSES RAHUL DEV
Associate Pastor C. B. Z. Church
Bapatla.

Scroll to top